డ్రైనేజీ కోసం తవ్వారు... మట్టి తారు రోడ్డుపై పోశారు...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలోని 2 వ వార్డు విద్యానగర్ మూలమలుపు వద్ద డ్రైనేజీ కోసం రోడ్డు వెంట తవ్వి,తారు రోడ్డుపై మట్టిని కుప్పగా పోశారు.నెలలు గడుస్తున్నా మట్టిని తొలగించకపోవడంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Excavated For Drainage Soil And Asphalt Were Poured On The Road, Excavated ,drai-TeluguStop.com

నేరేడుచర్ల పట్టణం నుండి ఇతర గ్రామాలకు వెళ్ళే వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్టానికులు ఆందోళన చెందుతున్నారు.

డ్రైనేజీ నిర్మాణం చేపట్టి నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడంపై కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందని,తవ్విన మట్టికుప్పలో చెట్లు మొలిచేంత వరకు మట్టిని తీయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మట్టి కుప్పను తొలగించి డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube