సెగ గడ్డలు.చిన్న సమస్యగానే కనిపించినా తీవ్ర బాధను కలిగిస్తాయి.
శరీరంలో అధిక వేడి, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఇన్ఫెక్షన్లు ఇలా రకరకాల కారణాల వల్ల చర్మంపై సెగ గడ్డలు ఏర్పడుతుంటాయి.అయితే కారణం ఏదైనప్పటికీ.
సెగ గడ్డలను తగ్గించడంలోనూ కొన్ని కొన్ని న్యాచురల్ టిప్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.మరి ఆ న్యాచురల్ టిప్స్ ఏంటీ.? అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఆరు నుంచి ఎనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ వాము వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్‌ను సెగ గడ్డలపై పెట్టుకుని.కాసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల కాస్త మంటగా అనిపించినా.రోజూ చేస్తే చాలా త్వరగా సెగ గడ్డలు తగ్గు ముకం పడతాయి.

అలాగే బియ్యం పిండితోనూ సెగ గడ్డలను నివారించుకోవచ్చు.అవును, ఒక బౌల్‌లో కొద్దిగా వాటర్ పోసి.అందులో బియ్యం పిండిని యాడ్ చేసి కాసేపు హీట్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా అయిన తర్వాత సెగ గడ్డలపై వేసి.డ్రైగా అయిన తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల సైతం సెగ గడ్డలు ఫాస్ట్‌గా తగ్గిపోతాయి.

కలబంద జెల్‌లో కొద్దిగా పసుపు కలిపి.గడ్డలపై అప్లై చేయాలి.బాగా ఆరిన తర్వాత వాటర్‌తో శుభ్ర పరుచుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.ఇక చర్మంపై సెగ గడ్డలు ఏర్పడినప్పుడు వేడి చేసే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.బార్లీ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, సబ్బా నీళ్ళు, దానిమ్మ రసం, మజ్జిగ వంటివి అధికంగా తీసుకోవాలి.