ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది.దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి చాలా మంది టెక్నాలజీని ఉపయోగించి ప్రజలను మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు.ఇటీవల ఫ్లోరిడాలో( Florida ) నివసించే ఒక వ్యక్తి, తన తల్లిదండ్రులను ఒక మోసగాడు 30,000 డాలర్లు (సుమారు రూ.25 లక్షలు ) దోచుకోబోయిన ఘటనను బయటపెట్టారు.ఈ మోసగాడు ఆ వ్యక్తి గొంతును కృత్రిమ మేధ( AI ) సాయంతో అనుకరించాడు.
ఈ విషయాన్ని ఫ్లోరిడా రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేస్తున్న జే షూస్టర్( Jay Shooster ) అనే వ్యక్తి ఎక్స్ (Twitter) వేదికపై పంచుకున్నారు.ఆ స్కామర్( Scammer ) తన తండ్రికి చేసిన ఫోన్ కాల్‌లో తన గొంతుతోనే మాట్లాడినట్లు చూస్తారు తెలిపాడు.ఆ కాల్‌లో జే శూస్టర్ కారు ప్రమాదానికి గురై, DUI కేసులో అరెస్ట్ అయినట్లు అతడి తల్లిదండ్రులను నమ్మించడానికి మోసగాడు ప్రయత్నించాడట.
కేసు నుంచి బయటికి తీసుకురావడానికి బెయిల్ కోసం 30,000 డాలర్లు పంపించు నాన్న అని తన గొంతుతోనే మాట్లాడినట్లు షూస్టర్ చెప్పాడు.ఆ తండ్రి మొదట్లో అది నిజమే అని అనుకున్నాడు తర్వాత మళ్లీ సొంత కొడుకుకి ఫోన్ చేసి ప్రశ్నిస్తే అసలు సంగతి తెలిసింది.
ఈ కుమారుడే ముందు నుంచి తల్లిదండ్రులకు ఏఐ టెక్నాలజీతో గొంతు మార్చి మోసగాళ్లు మాట్లాడవచ్చని హెచ్చరిస్తూ వస్తున్నాడట.అందువల్లే తండ్రి కొద్దిగా తెలివిగా వ్యవహరించ గలిగాడు.
షూస్టర్ చెప్పిన దాని ప్రకారం, ఒక టీవీ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన కేవలం 15 సెకన్ల ఆడియో క్లిప్‌తోనే మోసగాడు తన గొంతును కృత్రిమ మేధ సాయంతో అనుకరించగలిగాడు.ఇది ఎంతటి ప్రమాదకరమైన పరిణామమో అర్థమవుతుంది.షూస్టర్ తన ఎన్నికల ప్రచారం కోసం టీవీలో కనిపించిన కొద్ది సేపటి వీడియోను ఉపయోగించి మోసగాళ్లు తన గొంతును అనుకరించారని చెప్పారు.షూస్టర్ తన కుటుంబ సభ్యులే ఈ మోసానికి బలయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పడం విశేషం.
ఇలాంటి మోసాలను అరికట్టడానికి కృత్రిమ మేధపై కఠినమైన నియమాలు తీసుకురావాలని షూస్టర్ కోరారు.భవిష్యత్తులో నిజంగా ఎవరైనా ప్రమాదంలో పడితే, తమను తాము నిరూపించుకోవడం కష్టమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి టెక్నాలజీ వల్ల నిజంగా ప్రమాదంలో పడినా తల్లిదండ్రులు కూడా అది నిజమేనా అని అనుమానించే పరిస్థితి వస్తుంది.ఈ రకమైన వాయిస్ క్లోన్ చేసే మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఇవి చాలా తెలివిగా ఉంటాయి కాబట్టి గుర్తించడం కష్టం.ఈ మోసాలు ఒక రకమైన ఐడెంటిటీ థెఫ్ట్ అని కొంతమంది అంటున్నారు.