కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( MEA S Jaishankar ) ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా బ్రిస్బేన్‌లో( Brisbane ) నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ కాన్సులేట్‌ను( Indian Consulate ) ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఇప్పటికే ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో భారత హైకమీషన్‌తో పాటు మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్‌లలో ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి.రోజురోజుకి ఆస్ట్రేలియాకు( Australia ) భారత్ నుంచి వలసలు పెరుగుతుండటంతో రద్దీ నేపథ్యంలో బ్రిస్బేన్‌లో కొత్తగా కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రవాస భారతీయులు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ .బ్రిస్బేన్‌లో కాన్సులేట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ.కాన్సులేట్‌ను ప్రారంభించడంతో ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) చేసిన వాగ్థానం నెరవేరినట్లు అవుతుందన్నారు.ప్రస్తుతం భారత్ – ఆస్ట్రేలియా సంబంధాలు బలోపేతమయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు.కాన్సులేట్‌ను ప్రారంభించిన తర్వాత డాక్టర్ ఎస్ జైశంకర్ ఎక్స్ ద్వారా దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
బ్రిస్బేన్‌లో కొత్తగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.ఇది క్వీన్స్‌లాండ్ రాష్ట్రంతో( Queensland ) భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, విద్యా సంబంధాలను పెంపొందించడానికి , ప్రవాసులకు సేవ చేయడానికి దోహదం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో క్వీన్స్‌లాండ్ గవర్నర్ జెనెట్ యంగ్ పాల్గొన్నారు.
గతేడాది మేలో ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే.2014 తర్వాత ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించడం అది రెండోసారి.నాటి పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
దీనితో పాటు సమగ్ర ఆర్ధిక సహకార ఒప్పందం ద్వారా ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాలతో పాటు పెట్టుబడులపై చర్చించారు.నాడు సిడ్నీలో జరిగిన మెగా ఈవెంట్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.