తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ ( Amalapal )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొన్నటి వరకు ఈమె పేరు సోషల్ మీడియాలో మారు మోగిన విషయం తెలిసిందే.
రెండో పెళ్లి ఆ తర్వాత ఫోటోషూట్ ప్రెగ్నెన్సీ ఇలా వరుసగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ వచ్చింది.సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది అమలాపాల్.
గత ఏడాది ఈమె రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ప్రియుడు జగత్ దేశాయ్తో ( Jagat Desai )కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.

గత నవంబర్ 5న వివాహం జరగ్గా.ఇప్పుడు ఏడాది పూర్తయిన సందర్భంగా అమలాపాల్ అప్పటి మధుర జ్ఞాపకాల్ని షేర్ చేసుకుంది.కేరళలోని కొచ్చిలో ( Kochi, Kerala ) ఈ పెళ్లి వేడుక జరిగింది.ఈ పెళ్లి వీడియో అంతా బాగానే ఉంది.కాకపోతే అమలాపాల్ పరోక్షంగా తన మొదటి భర్త గురించి పరోక్షంగా కామెంట్స్ చేసింది.నా జీవితంలో గతంలో కొన్ని తప్పులు జరిగాయి.
వాటికి థ్యాంక్స్ చెబుతున్నాను.ఎందుకంటే వాటి వల్లే ఇతడు నా జీవితంలోకి వచ్చాడు అని అమలాపాల్ చెప్పుకొచ్చింది.

ఈమె జీవితంలో తప్పు అంటే అది దర్శకుడు ఏఎల్ విజయ్( Directed AL Vijay ) తో పెళ్లే అనుకుంటా! అలానే జగత్ దగ్గర ఉంటే చాలా సేఫ్‌గా అనిపిస్తుందని కూడా చెప్పింది.ఇలా మొదటి భర్త గురించి పరోక్షంగా కామెంట్స్ చేయడంతో కొందరు ఆమెపై మండిపడుతున్నారు.ఇక ఈమె విషయానికొస్తే మొదట తమిళంలో నటిగా కెరియర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగులో కూడా పలు సినిమాలలో నటించింది.2014లో తమిళ దర్శక నిర్మాత ఏఎల్ విజయ్ ను పెళ్లాడింది.కొంతకాలానికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవడమే మంచిదని నిర్ణయానికొచ్చారు.2017లో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న అమలాపాల్ గతేడాది నవంబర్ 5న జగత్ దేశాయ్‌ని పెళ్లి చేసుకుంది.వీళ్లకు ఒక బాబు కూడా పుట్టాడు.







