హీరోయిన్ త్రిష( Trisha ) గురించి మనందరికీ తెలిసిందే.అప్పుడెప్పుడో వచ్చిన వర్షం సినిమా నుంచి ఇప్పటివరకు అదే అందాన్ని మెయింటైన్ చేయడంతో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఈ భామ ఇండస్ట్రీకి దూరమైంది.
కానీ కారణం ఏంటో తెలియదు కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.
![Telugu Tollywood, Trisha, Trishatamil, Vijay-Movie Telugu Tollywood, Trisha, Trishatamil, Vijay-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/trisha-dating-a-tamil-hero-star-heroine-who-reacted-for-the-first-time-actually-this-is-not-a-normal-shockb.jpg)
అది కూడా మామూలు అందంతో కాదు.ఈ భామను చూస్తే యంగ్ హీరోయిన్స్( Young heroines ) కూడా కుల్లుకోక తప్పదు అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే అజిత్( Ajith ) హీరోగా నటిస్తున్న విడామూయార్చి సినిమాలో కూడా నటిస్తోంది.ఇలా ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో బిజీబిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా త్రిష చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
![Telugu Tollywood, Trisha, Trishatamil, Vijay-Movie Telugu Tollywood, Trisha, Trishatamil, Vijay-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/trisha-dating-a-tamil-hero-star-heroine-who-reacted-for-the-first-time-actually-this-is-not-a-normal-shockc.jpg)
దళపతి విజయ్ తో ఆమె రిలేషన్ లో ఉంది అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.సోషల్ మీడియాలో నాపై ఇష్టమొచ్చినట్టు రాస్తుంటారు.వాటిని పట్టించుకోని నేను నా ఎనర్జీని వృధా చేసుకోను.
నాకంటూ బోలేడు పనులు ఉన్నాయి.ఇలాంటి పనికి మాలిన వాటికి స్పందించాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగా స్పందించింది త్రిష.