ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పిల్ల నుంచి పెద్ద వారి వరకు సోషల్ మీడియాలో వారి సమయాన్ని గడుపుతూనే ఉన్నారు.సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు ఎంతటి సాహసం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.
కొంతమంది రీల్స్ పిచ్చిలో పడి వారి కుటుంబాలను సైతం పట్టించుకోకుండా అనేక ఇబ్బందులు ఎదురకొంటూ ఉన్నారు.అచ్చం అలాంటి సంఘటన ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లో చోటుచేసుకుంది.
గంగా నదిలో పుణ్య స్థానాలకు వెళ్లిన ఒక కుటుంబం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఐదేళ్ల చిన్నారి నీట మునిగి మృతి చెందింది.సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో చౌబేపూర్ ప్రాంతంలోని ( Choubeypur area in Varanasi )ఉమర్హా గ్రామానికి చెందిన అంకిత అనే మహిళ తన ఐదేళ్ల కుమార్తె తాన్యతో( Tanya ) తన పుట్టింటికి సైద్‌పూర్ లోని బౌర్వాన్ గ్రామానికి ( Bourwan village )వచ్చింది.కార్తీక మాసం సందర్భంగా ఛత్ పూజ జరుపుకోవడానికి కుటుంబ సభ్యులు అందరూ పుణ్యా స్నానాలు ఆచరించే కొరకు గంగా నది నీటిలో స్నానాలు చేస్తూ ఉన్నారు.అయితే నడి ఒడ్డున ఉన్న స్మృతి నీళ్లలో స్నానం చేస్తున్న వారిని ఇంస్టాగ్రామ్ రీల్స్ రికార్డ్ చేస్తుంది.ఇలా రీల్స్ చేస్తున్న క్రమంలో రికార్డింగ్స్ పెట్టిన అంకిత తనతో పాటు నీళ్లలోకి తీసుకెళ్ళిన కూతురు తాన్యను మరిచిపోయింది.
దాంతో తాన్య నీటిలో ఆడుకుంటూ అలాగే లోతైన నీళ్లలోకి వెళ్లిపోయి నీటిలో కొట్టుకపోయింది.ఇలా రీల్స్ చేస్తున్న క్రమంలో తాన్య మునిగిపోవడం కుటుంబ సభ్యులు ఎవరు కూడా గుర్తించలేరు.
కాసేపటి తర్వాత చిన్నారి తాన్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులందరూ ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించగా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది.
ఆ సమయంలో స్మృతి రికార్డు చేసిన వీడియోను పరిశీలన చేయగా.అందులో తాన్య అదృశ్యమైన దృశ్యాలు కనిపించాయి.సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేయగా.
సుమారు ఒకటిన్నర గంట తర్వాత తాన్య మృహదేహం సుమారు 50 మీటర్ల దిగువన లభ్యమయ్యింది.వెంటనే తాన్య దగ్గర్లోని సైదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించగా.
అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
కొంతమంది ఆ తల్లి నిర్లక్ష్యం కారణంగా చిన్నారి తాన్య చనిపోయిందని కామెంట్స్ చేస్తుంటే.మరికొందరు బాధాకర ఎమోజిస్స్ కామెంట్ చేస్తున్నారు.