పెద్ద పెద్ద సిటీలలో ట్రాఫిక్ అయింది అంటే చాలు బిచ్చగాళ్ల బెడద( beggars ) ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయింది.కొందరు డబ్బులు లేదు అనగానే వెళ్లిపోగా మరి కొందరు మాత్రం డబ్బులు ఇవ్వాలని వేధిస్తూ ఉంటారు.
పదే పదే డబ్బులు అడిగి ఇరిటేషన్ కూడా తెప్పిస్తూ ఉంటారు.ఇంకొన్నిసార్లు పెన్నులు బుక్స్, ఇతర వస్తువులు అమ్మడానికి అని వచ్చి డబ్బులు కాజేసి పారిపోతూ ఉంటారు.
టాలీవుడ్ హీరోయిన్ ( Tollywood heroine )కూడా ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురైంది.ఇదే విషయాన్ని సదరు హీరోయిన్ చెప్పుకొచ్చింది.
అసలేం జరిగిందంటే.
![Telugu Begger, Nivethapethuraj, Experience, Tollywood-Movie Telugu Begger, Nivethapethuraj, Experience, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/nivetha-pethuraj-shares-shocking-experience-beggarb.jpg)
తాజాగా అడయార్ జంక్షన్ ( Adyar Junction )దగ్గర ఆగినప్పుడు 8 ఏళ్ల పిల్లాడు డబ్బులు అడిగాడని, ఇవ్వనని చెప్పేసరికి ఒక పుస్తకం చూపించి రూ.100 అడిగాడని సరే కదా అని 100 తీసి ఇస్తుండగా ఏకంగా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేశాడని నివేదా తెలిపింది.దీంతో పుస్తకం ఏమొద్దని చెప్పి 100 రూపాయలు తిరిగి తీసుకున్నానని,అప్పుడు ఆ బాలుడు పుస్తకాన్ని కారులో విసిరేసి తన దగ్గర డబ్బులు లాక్కొని పారిపోయాడని నివేదా పేతురాజ్ ( Niveda Pethuraj )తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టింది.ఇలా బెదిరింపులతో భిక్షాటన చేయడం కరెక్టేనా అని ఆమె ప్రశ్నించింది.
![Telugu Begger, Nivethapethuraj, Experience, Tollywood-Movie Telugu Begger, Nivethapethuraj, Experience, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/nivetha-pethuraj-shares-shocking-experience-beggarc.jpg)
ఈ విషయంపైనే నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఈ మధ్యకాలంలో వాళ్ళు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇంకొందరు అలా బిచ్చగాళ్లు వచ్చే డబ్బులు అడిగినప్పుడు లేదని చెప్పడం కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే నివేదా పేతురాజ్ విషయానికి వస్తే.ఈమె తెలుగులో మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, బ్లడ్ మేరీ, దాస్ కా దమ్కీ లాంటి చాలా సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం తమిళం తో పాటు తెలుగులో పలు సినిమాలలో నటిస్తోంది నివేదా.