వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీతిసింగ్(Diwali festival).ఈమె తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇలా ఒక వైపు తెలుగు సినిమాలతో పాటు మరోవైపు తమిళ సినిమాలలో కూడా నటిస్తున్న రకుల్ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ఇలా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీభగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం ఈమె సౌత్ సినిమాలలో నటించకపోయిన బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా రకుల్ దీపావళి పండుగకు(Rakul for Diwali festival) సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు.
అందరూ టపాసులు కాలుస్తారు.
నేను ఐదవ తరగతి చదువుతున్న సమయంలో మా నాన్న దీపావళి పండుగకు(Diwali festival) నాకు 500 రూపాయలు డబ్బులు ఇచ్చారు.ఆ డబ్బు ఎందుకు అని నేను నాన్నను అడిగితే ఈ డబ్బుతోనే కదా నువ్వు టపాకాయలు కొని కాలుస్తావు, దాని వల్ల ఎంత కాలుష్యం, అదే ఈ డబ్బుతో ఎవరన్నా పేదవారికి, అవసరం ఉన్న వారికి చాక్ లెట్స్ లేదా ఇంకేమన్నా కొనివచ్చు అని అన్నారు.ఆరోజు నాన్న చెప్పిన మాట నిజమేనని అనుకున్నాను.
అప్పటి నుండి ఇప్పటివరకు మళ్ళీ టపాసులు కాల్చలేదని రకుల్ తెలిపాటు.ఆరోజు నాన్న ఇచ్చిన ఆ 500 నా జీవితాన్ని ఎంతో మార్చేసిందని ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.