తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సెటైర్లు వేశారు.తెలంగాణలో కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆ పార్టీపై రకరకాల విమర్శలతో విరుచుకుపడుతూ వస్తున్నారు కేటీఆర్.
ఇక కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలకు దిగడం, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం వంటి వాటితో గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకులకు, కేటీఆర్ కు మధ్య మాటలు యుద్ధం జరుగుతూనే ఉంది.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాన్ని మరింతగా వేడెక్కించే పనిలో ఉన్నారు.
![Telugu Brs Ktr, Congress, Ktr, Revanth Reddy, Rythu Bharosa, Telangana-Politics Telugu Brs Ktr, Congress, Ktr, Revanth Reddy, Rythu Bharosa, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/11/brs-working-president-ktr-criticizes-telangana-govt-detailsa.jpg)
ఇక తెలంగాణ ప్రభుత్వ పాలనపైన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ స్పందిస్తూ విమర్శలు సంధిస్తూనే ఉన్నారు.తాజాగా మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు కేటీఆర్.వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుస్తామన్న మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కేటీఆర్ విమర్శించారు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని , రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు.‘ 300 రోజుల పాలన ముగిసింది.ఏడాది నిండడానికి 35 రోజులు మిగిలింది.
రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు.
![Telugu Brs Ktr, Congress, Ktr, Revanth Reddy, Rythu Bharosa, Telangana-Politics Telugu Brs Ktr, Congress, Ktr, Revanth Reddy, Rythu Bharosa, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/11/brs-working-president-ktr-criticizes-telangana-govt-detailss.jpg)
ఎకరాకు పదిహేను వేలు రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు.పెంచిన 4 వేల పెన్షన్ ఎక్కడుటున్నారు అవ్వ తాతలు.నెల నెల ఇస్తామన్న 2500 ఎక్కడబోయాయంటున్నారు ఆడబిడ్డలు.
ఉద్యోగులు మా పియర్సి ఎక్కడ, మా డి ఏ లు ఎక్కడని సమ్మెలు అంటున్నారు.రైతులకు 15000 ఎక్కడ, రైతు కూలీలు 12000 ఎక్కడ అంటున్నారు.
తులం బంగారం ఎక్కడ అంటున్నారు.మా బంగారు తల్లులకు చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే.
మూసిలో లక్షల కోట్లు మూటాలాయే.ఏడాది కాలమంతా అటెన్షన్ , డైవర్షన్ తో పబ్బం గడిపిన మూసి సర్కార్.
ఏమైంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం .ధర్నాలు, రాస్తో రోకో లు తప్ప’ అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.