తాజాగా దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటు ప్రస్తుతం భారీగా కలెక్షన్స్ ని రాబడుతూ దూసుకుపోతున్నాయి.అమరన్, క, లక్కీ భాస్కర్ చిత్రాలకు అడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది.
అలాగే ఒక రేంజ్ వసూళ్లు రాబడుతూ పోటాపోటీగా సత్తా చాటుతున్నాయి.అందులో మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) లక్కీ భాస్కర్( Lucky Bhaskar Movie ) సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే అంశాలకు ఎమోషన్ జోడించి అద్భుతంగా రూపొందించాడు డైరెక్టర్ వెంకీ అట్లూరీ.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ అియన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ.18.07 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే లక్కీ భాస్కర్ సినిమాకు దుల్కర్ సల్మాన్ ఫస్ట్ ఛాయిస్ కాదట.
నిజానికి ఈ చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) చేయాల్సి ఉందట.ఈ సినిమా కథను ముందుగా డైరెక్టర్ వెంకీ అట్లూరి నానికి చెప్పగా.
లైన్ బాగుందని.కానీ అప్పటికే వరుస సినిమాల్లో నటిస్తుండడంతో ఈ ప్రాజెక్టును చేయలేకపోయాడట నాని.
ఆ తర్వాత ఈ కథను దుల్కర్ సల్మాన్ కు చెప్పగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ఇందులో మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నాడు దుల్కర్ సల్మాన్.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ కావడంతో నాని మరో హిట్టు మిస్సయ్యాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.