చిరంజీవికి ఆ ఫుడ్ అంటే అంత ఇష్టమా.. ఏంటో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ( Churanjeevi ) ఒకరు.ఈయన హీరోగా ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 Do You Know Chiranjeevi Favourite Food , Chiranjeevi, Favourite Food, Chepala Pu-TeluguStop.com

ఆరు పదుల వయసులో కూడా యువ హీరోలకు పోటీగా సినిమాలలో నటించడమే కాకుండా అంతే యాక్టివ్ గా డాన్సులు కూడా వేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇకపోతే త్వరలోనే ఈయన విశ్వంభర ( Vishwambara ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.

Telugu Chepala Pulusu, Chiranjeevi, Favourite, Naatukodi-Movie

ఇకపోతే చిరంజీవి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాల గురించి వెల్లడించారు.చిరంజీవి భోజన ప్రియులు అయినప్పటికీ చాలా మితంగా ఆహారం తీసుకుంటారు.అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చిరంజీవి అభిమానులు కొన్ని ప్రశ్నలను ఒక పేపర్లో రాసి ఇవ్వగా సుమ వాటిని అడుగుతూ చిరంజీవి నుంచి సమాధానాలను రాబట్టారు.

ఈ క్రమంలోనే ఓ అభిమాని చిరంజీవికి బాగా ఇష్టమైన ఫుడ్ ( Favourite food ) ఏది చేపల పులుసు నాటుకోడి పులుసు ఈ రెండింటిలో ఏది ఇష్టం అంటూ ప్రశ్న వేశారు.

Telugu Chepala Pulusu, Chiranjeevi, Favourite, Naatukodi-Movie

ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ.మీరు చెబుతుంటేనే నోరు ఊరి పోతుంది రెండు వదలకుండా తింటాను అంటూ సమాధానం చెప్పారు.అయితే రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సమాధానంగా చెప్పాలి అంటూ సుమ తిరిగి ప్రశ్నించడంతో తనకు చేపల పులుసు ( Chepala Pulusu ) అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు.

ముఖ్యంగా తన తల్లి అంజనా దేవి చేసిన చేపల పులుసు అంటే చాలా ఇష్టమని చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే చిరంజీవి కూడా అప్పుడప్పుడు వంటగదిలోకి తన చేతి వంట రుచిని అందరికీ చూపిస్తూ ఉంటారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే విశ్వంభర సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube