అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాట్ అభ్యర్ధి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు( Kamala Harris and Donald Trump ) నెక్ టూ నెక్ పోరాడుతున్నారు.
ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ప్రవాస భారతీయులను తమ వైపుకు తిప్పుకోవడానికి రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కిందా మీదా పడుతున్నారు.ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఓ జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ కాంగ్రెస్ నేత తులసీ గబ్బార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్ధతు ఇవ్వాలని ఆమె ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్‌కు తన మద్ధతు తెలిపిన తులసి గబ్బార్డ్.
( Tulsi Gabbard ).కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు భారతీయ వలసదారులను ప్రభావితం చేసే క్లిష్టమైన ఇమ్మిగ్రేషన్ సమస్యలను , ముఖ్యంగా గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్ వంటి అంశాలను డెమొక్రాట్లు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.భారతీయ మూలాలు ఉన్నప్పటికీ.ఇండో అమెరికన్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కమలా హారిస్ చేసిందేమీ లేదన్నారు.
కాగా.2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం కమలా హారిస్ , తులసి గబ్బార్డ్‌లు హోరాహోరీగా తలపడ్డారు.చివరికి డిసెంబర్ 2019లో కమలా హారిస్, 2020 మార్చిలో తులసి గబ్బార్డ్‌లు రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.డొనాల్డ్ ట్రంప్‌తో చాలా ఏళ్లుగా స్నేహంగా ఉంటోన్న ఆమె ఒకానొక దశలో ట్రంప్ రన్నింగ్‌మెట్ అవుతారని అమెరికన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
కొద్దిరోజుల క్రితం ట్రంప్ ప్రచార ప్రతినిధి కరోలిన్ లీవిట్ .ఒక ఈ మెయిల్‌లో గబ్బర్డ్ రాకను ధృవీకరించినట్లు న్యూయార్క్ టైమ్స్( New York Times ) నివేదించింది.విధాన సలహాదారులు, తులసి గబ్బార్డ్ వంటి ప్రభావంతమైన వ్యక్తులతో ట్రంప్ సమావేశాలను కొనసాగిస్తారని లీవిట్ వెల్లడించారు.
ఆగస్ట్‌లో డెట్రాయిట్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్‌తో కలిసి తులసి గబ్బార్డ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా తులసీ గబ్బార్డ్ మాట్లాడుతూ.డెమొక్రాట్ల పాలనలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు వైదొలగిన విధానాన్ని ఆమె తప్పుబట్టారు.ట్రంప్ యుద్ధాన్ని చివరి అస్త్రంగా పరిగణనలోనికి తీసుకుంటారని తులసీ ప్రశంసించారు.