ప్రపంచంలో చాలా దేశాలు టెక్నాలజీ( Technology ) రంగం వైపు పరుగులు పెడుతుంటే.కొన్ని దేశాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలతో కొట్టుకొని చస్తున్నారు.
ఇలాంటి ఘటనలు భారతదేశంలో కూడా తక్కువ ఏం కాదు.కులాలు, మతాలు అంటూ.
, గిరిజనులు, దళితులపై దాడులు.ఇంకా అనేక మూఢనమ్మకాలు ఇలా కొన్ని ప్రాంతాలలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా ఓ అమానుష సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనలో ఓ గిరిజన యువకుడిని కట్టేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అతనిపై దాడి చేసి చిత్రహింసల గురిచేసి చివరికి అతని ముఖంపై మూత్ర విసర్జన కూడా చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోన్ భద్ర ( sonabadra )జిల్లాలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
కొంతమంది యువకులు ఒక్కసారిగా దాడి చేసి ఆపై తిడుతూ నోట్లో మూత్రం పోశారు.ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో వైరల్ గా మారడంతో విషయం కాస్త పోలీసుల వద్దకు చేరుకుంది.ఈ ఘటనలో బాధితుడు పవన్ ను అంకిత్ భారతి ( Ankit Bharti )తోపాటు మరో ఎనిమిది మంది కలిసి కాలుతో తన్నుతూ చిత్రహింసలు పెట్టారు.ఈ విషయంపై శివకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు అదనపు ఎస్పీ కులు సింగ్ తెలిపారు.
ప్రస్తుతం ఘటనకు సంబంధించిన విషయాన్ని నమోదు చేసుకుని పోలీసులు నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.అయితే ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు అంకిత్ భారతిని అరెస్టు చేశామని మిగతా నిందితుల కోసం తాము గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.