యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) చాలామంది సినిమా వాళ్లతో స్నేహం చేస్తుంటారు.వారిలో ప్రభాస్ శీను( Prabhas Sreenu ) ఒకరు.
ప్రభాస్, శ్రీను ఇద్దరూ ఓ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాచ్ మేట్స్‌గా ఉన్నారు.అంతకుముందు కూడా వీరు మంచి ఫ్రెండ్స్.
ప్రభాస్ సినిమాల్లో హీరోగా మారిన తర్వాత ఆయన డేట్స్‌ను శ్రీను మేనేజ్ చేసేవాడు.ఆ సమయంలో చాలామంది దర్శకులు ప్రభాస్ శ్రీనుకు పరిచయం అయ్యారు.
శ్రీను సినిమా సెట్స్ లో ఉన్నప్పుడు చాలా కామెడీ చేసేవాడు అతనికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది.అయితే అతనిలో మంచి నటుడు కమెడియన్ ఉన్నాడని మొదటిగా రాజమౌళి( Rajamouli ) గుర్తించాడు.
ప్రభాస్ చత్రపతి సినిమా( Chatrapathi Movie ) చేసేటప్పుడు అతని పక్కనే ఉన్నాడు శ్రీను.అంతేకాదు చాలా జోకులు పేలుచుతో సెట్స్ లో ఉన్న వారందరినీ నవ్వించేవాడు.ఇది గమనించిన రాజమౌళి ఎక్కడ కాదు ఈ స్క్రీన్ మీద కామెడీ చేయాలి అని చెప్పారట అయితే తన బ్లాక్ ఫేస్ చూసి ఎవరు తనకు సినిమాల్లో అవకాశం ఇస్తారంటూ శ్రీను బదులు ఇచ్చాడట.అప్పుడు రాజమౌళి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు.
కానీ శ్రీనును గుర్తుపెట్టుకున్నాడు.ఛత్రపతి తరువాత రవితేజతో ఆయన తీసిన “విక్రమార్కుడు”( Vikramarkudu ) సినిమాలో శ్రీనుకు ఒక రౌడీ గ్యాంగ్‌కి హెడ్ గా నటించే ఛాన్స్ అందించాడు.
ఈ సీన్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది.రవితేజ చేతిలో తన్నులు తినే ఒక క్యారెక్టర్ లో ప్రభాస్ శీను నటించాడు.ఇందులో పండించిన కామెడీ చాలామందికి నచ్చింది విక్రమార్కుడు సినిమా పెద్ద హిట్ కావడంతో ప్రభాస్ శ్రీనుకు మరింత గుర్తింపు వచ్చింది దాని తర్వాత శ్రీను తన కెరీర్ లో వెన్ను తిరిగి చూసుకోలేదు.చాలా సినిమాల్లో ఆఫర్ రావడంతో ఒక్కసారిగా బిజీ అయిపోయాడు.
పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఊసరవెల్లి, గబ్బర్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కమెడియన్ వందల సినిమాల్లో నటించాడు.రాజమౌళి పుణ్యమా అని ప్రభాస్ శీను లైఫ్ కమెడియన్ గా సెట్ అయిపోయింది.
శ్రీను చాలా బాగా నటిస్తాడు కాబట్టి ఇప్పటికీ ఆయనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ప్రతి పాత్రకు కూడా 100% న్యాయం చేస్తూ ఆలోచిస్తున్నాడు.
డార్లింగ్ సినిమాలో శ్రీను యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.