యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) టెంపర్ సినిమా ఆడియో ఈవెంట్ లో ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని మాటివ్వగా ఆ మాటను నిలబెట్టుకున్నారు.అమిగోస్ సినిమా( Amigos movie ) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవర అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని చెప్పగా ఆ మాటను సైతం నిలబెట్టుకోవడం జరిగింది.
దేవర మూవీ భారీ మార్క్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకుంది.
ఫుల్ రన్ లో ఈ సినిమా 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను అందుకోవడం పక్కా అని తేలిపోయింది.
కళ్యాణ్ రామ్( Kalyan Ram ) కు గతంలో జై లవకుశ సినిమాతో నిర్మాతగా సక్సెస్ ను అందించిన తారక్ దేవర సినిమాతో అంతకు మించిన విజయాన్ని అంతకు మించిన లాభాలను అందించారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.దేవర సెప్పినాడంటే చేస్తాడని అర్థం అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

దేవర ఇప్పటికీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ప్రదర్శితమవుతూ ఉండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు సైతం ఫ్యాన్స్ అంచనాలను మించి ఉంటాయని తారక్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా సత్తా చాటుతున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.దేవర2 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ త్వరలో వెలువడే ఛాన్స్ అయితే ఉంది.

దేవర1 విషయంలో వచ్చిన విమర్శలు దేవర సీక్వెల్ విషయంలో వచ్చే ఛాన్స్ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యావరేజ్ సినిమాలను సైతం తన అద్బుతమైన అభినయంతో తారక్ నిలబెడుతున్నారు.రికార్డ్ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శితం కావడంతో దేవర ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది.
ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.