అవబోసన దశకు వచ్చిన నాకు కుమారుడిని చూపించండి అని వేడుకోలు రాజన్న సిరిసిల్ల జిల్లా : అయ్యా!నా కొడుకును పెంచి పెద్ద చేసిన,ఒక స్థాయికి తెచ్చిన నాకు ఇప్పుడు చేతన అవుతలేదు.ఉన్న ఒక్కగానొక్క కొడుకు నాకు ఇప్పుడు ఆసరాగా ఉంటాడని అనుకున్న కానీ వానీ జాడ లేదు.
పత్తా లేదు.జెర ఎట్లనన్న చేసి నా కొడుకును నా ఇంటికి తెప్పించే ప్రయత్నం చేయు బిడ్డా! అని ఆ వృద్ధురాలు వేడుకుంది.
ఎల్లారెడ్డిపేట కు చెందిన తాళ్ళ సత్తవ్వ(75) ఈమెకు తాళ్ళ వెంకట్ రెడ్డి అలియాస్ ఐజాక్ (40) కుమారుడు ఉన్నాడు.కూకట్ పల్లి లో గల చర్చ్ లో గతంలో పాస్టర్ గా పని చేస్తుండగా సత్తవ్వ కరోనా కంటే ముందు కుమారుడి దగ్గరకు వెళ్లి వచ్చింది.
తరువాత ఇంటికి వచ్చేటప్పుడు కొడుకు తన పోన్ నంబర్ ఇచ్చిండు, కానీ ఇప్పుడు అతడి పోన్ కలుస్తలేదు.ఇన్ని రోజులు వాన్ని సాది సవరించి ఇంత పెద్ద వాన్ని చేస్తే కొడుకు నాకు కనబడకుండా ఎక్కడ ఉన్నాడో అని ఆ తల్లి కన్నీటి పర్యంతమైనది.బిడ్డా! బాలరాజు నా కొడుకును ఎట్లానన్న చేసి ఎల్లారెడ్డిపేట కు తెప్పించే ప్రయత్నం చేయు అని చెప్పగా తప్పకుండా నీ కొడుకును నీ వద్దకు చేరుస్తానని,ఒగ్గు బాలరాజు సత్తవ్వకు భరోసా ఇచ్చారు.