ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి - అదనపు కలెక్టర్ పూజారి గౌతమి

రాజన్న సిరిసిల్ల జిల్లా : లోక్ సభ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని సిరిసిల్ల ఏఆర్ఓ ( అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్), అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల ఏఆర్ఓ పరిధిలోని సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్ కు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం శిక్షణ ఇచ్చారు.

 Election Duties Should Be Performed Efficiently - Additional Collector Pujari Ga-TeluguStop.com

ఈ సందర్భంగా సిరిసిల్ల ఏఆర్ఓ( అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్), అదనపు కలెక్టర్ పూజారి గౌతమి మాట్లాడారు.సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్ తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను బీఎల్ఓ లేదా గ్రామ ప్రత్యేక అధికారులతో కలిసి వెంటనే సందర్శించాలని సూచించారు.

ఆయా పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలు పరిశీలించాలని ఆదేశించారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలను పరిశీలించాలని తెలిపారు.

సంఘ విద్రోహక పనులు చేసే వ్యక్తులు ఉంటే వారి పూర్తి వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు.పోలింగ్ తక్కువ నమోదైన కేంద్రాల వివరాలు తమ వద్ద ఉండాలని తెలిపారు.

ఎన్నికలకు ఒక రోజు ముందు, ఎన్నికల రోజు చేపట్టాల్సిన విధులపై సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ సెక్టార్ ఆఫీసర్స్ కు వివరించారు.పోలింగ్ రోజు ఉదయం నిర్వహించే మాక్ పోలింగ్, పోలింగ్ ముగిసిన అనంతరం చేయాల్సిన పనులపై తెలిపారు.

అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా, సీ విజిల్, సువిధ, ఇతర ఎన్నికల యాప్ ల వినియోగం పై అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ షరీఫ్ మోహినొద్దిన్, సెక్టోరియల్ మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube