రావుల పాలనలో మనకేం రావు

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది రాజన్న సిరిసిల్ల జిల్లా:కేసీఆర్ ( KCR )రావుల పాలనలో మనకేం రావు అని ప్రజలకు అర్థమైందని సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు.ఆమె ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, సింగారం, బండలింగంపల్లి, గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల,కొత్తపల్లి గ్రామాలలో పర్యటించారు.

 Manakem Rao In Rao's Rule , Kcr, Narayanpur, Singaram, Bandalingampally, Gambhi-TeluguStop.com

ఇంటింటా తిరిగి ఓట్లు అభ్యర్థించారు.భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హామి ఇచ్చిన హామీలేవీ అమలుకాలేవన్నారు.దళిత సీఎం ను చేయలేదన్నారు.

దళితులకు మూడేకరాల భూమి ఇవ్వలేదన్నారు.రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదన్నారు.

కొత్తపెన్షన్లు,కొత్త రేషన్లు కార్డులు పేదలకు అందలేదన్నారు.రావుల పెత్తనంలో ప్రజలకు ఏమీ రావన్నారు.

ఒక్కటి వచ్చాయన్నారు.ఊరూరా బెల్ట్ షాపులు మాత్రం వచ్చాయన్నారు.

బెల్ట్ షాపుల ద్వారా వచ్చే రాబడితో ప్రభుత్వాన్ని కేసీఆర్ నడుపుతున్నారన్నారు.కేసీఆర్ సంపాదన కోసం పేదల సంసారాలు నాశనం చేస్తున్నరన్నారు.

బీజేపీ( BJP ) పాలన ప్రజాదక్షత గల పాలన అన్నారు.మోడీ పాలనలో దేశం పురోగమిస్తోందన్నారు.

మోడీ( modi ) నాయకత్వాన్ని దేశం అంతా బలపరుస్తోందన్నారు.కేటీఆర్ ను గద్దె దించి సిరిసిల్లలో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు.

మోడీ పాలన తెలంగాణలో రావాల్సిన అవసరం ఉందన్నారు.ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో ఆమె పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

కాంగ్రెస్,బీఆర్ఎస్ లు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.ఈసారి తెలంగాణలో బీజేపీ పాలన ఏర్పడబోతోందన్నారు.

ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి,మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు స్వామి, నారాయణపూర్ బిజెపి నాయకులు వంగల రాజు, కోనేటి సాయిలు, బిజెవైఎం నాయకులు బోనాల సాయి, మానుక కుమార్ యాదవ్, బిజెపి కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube