ప్రజలు రోడ్ భద్రత ,ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలి - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: 35వ రోడ్ భద్రత మాసోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థిని, విద్యార్థులతో, ఆటో డ్రైవర్లు, వాహన దారులతో ఏర్పాటు చేసిన రహదారి భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…35వ రోడ్ భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో రోడ్ భద్రత అవగాహన కార్యక్రమాలు నిరహిస్తున్నాం అని,అంతే కాకుండా జిల్లాలోని ప్రతి పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం అన్నారు.

 People Must Follow Traffic Rules Sp Akhil Mahajan, Traffic Rules ,sp Akhil Maha-TeluguStop.com

ప్రజలు రోడ్ భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సిట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, ప్రాణం ఎంతో విలువైనది అని మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని మద్యం సేవించి, నిర్లక్ష్యంగా ,ర్యాష్ డ్రైవింగ్,రాంగ్ రూట్ లో ,అవగాహన రహిత్యంలో వాహనాలు నదువుతు ప్రాణాల మీద తెచుకోవద్దని అన్నారు.ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైన్సెన్స్ కలిగి ఉండాలని, మైనర్ డ్రైవింగ్ చేయడం నేరం అని మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వరాదు అని తెలిపారు.

రహదారులు ప్రాచీన నాగరికతకు చిహ్నం అని,రహదారులు పచ్చని నీడనిచ్చే చెట్లతో కళలాడలే తప్ప రక్తపు మరకలతో తడసిపోవద్దని దానికోసం ప్రతి ఒక్కరు రోడ్ భద్రత నియమాలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఈ సందర్భంగా కోరారు.అనంతరం ట్రాఫిక్ ఎస్.ఐ రాజు విద్యార్థులతో, వాహనదారులతో రహదారి ప్రతిజ్ఞ చేపించారు.ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ రఘుపతి, ట్రాఫిక్ ఎస్.ఐ రాజు సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, వాహనదారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube