గంజాయి అక్రమ రవాణా చేసిన, సేవించిన కఠిన చర్యలు తప్పవు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేసిన,సేవించిన కఠిన చర్యలు తప్పవు అని,గంజాయి కేసులలో పట్టుపడిన నిందుతులకు కఠిన శిక్షలు పదేవిధంగా కృషి చేస్తామని,గత 15 రోజుల్లో 09 గంజాయి కేసులు నమోదు చేసి 27 మందిని అరెసస్ట్ చేయడంతో పాటు 3 కిలోల 925 గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.

 Strict Action Will Be Taken Against Those Who Smuggled And Consumed Ganja Distri-TeluguStop.com

జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుంది అన్నారు.వివిధ జిల్లాల నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

యువత మాదక ద్రవ్యాలు అలవాటు పడకుండా మరియు మాదక ద్రవ్యాలు ఎక్కడైనా అమ్మడం గాని సరఫరా చేయడం గాని జరిగితే వెంటనే వారిపై తగిన చర్యలను తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారిచేయడం జరిగింది అని జిల్లా పరిధిలో గంజాయి రవాణా,విక్రయాలు జరిపి యువతను మత్తు పధార్థాలకు బానిసలను చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.

గంజాయి మత్తులో ఎంతో మంది యువత వారికి తెలియకుండానే నేరాలకు పాల్పడి జైలుజీవితం గడుపుతున్నారు.

గంజాయి,మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు.గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ గారు తెలిపారు.

తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన దృష్టి సారించాలని,గంజాయి కి అలవాటు పడి మనేయలేని స్థితిలో ఉన్న వారిని తమ వద్దకి తీసుకువస్తే మానసిక నిపుణులతో అవగాహన కల్పింస్తామన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో,కలశాలలో గంజాయ ,మత్తు పధార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిరహిస్తున్నామని అన్నారు.

జిల్లాలో గత 15 రోజుల్లో 9 గంజాయి కేసులు నమోదు చేసి 27 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 3 కిలోల 925 గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది అని ఫిబ్రవరి నెలలో ముస్తాబద్ మండలం గుడెం గ్రామానికి చెందిన విక్రమ్ కుమార్ గంజాయి సేవిస్తూ,అమ్ముతుండగా పట్టుబడిన కేసులో ఒక సంవత్సరం జైల్ శిక్ష తో పాటుగా 5000 రూపాయలు జరిగిన గౌరవ కోర్టు విధించింది అని గంజాయి కేసులల్లో పట్టుపడిన నిందుతులకు శిక్ష లు పడేవిధముగా కృషి చేస్తామని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube