తండ్రి మరణం... కుమారుడికి పరీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా :కంటికి రెప్పలా కాపాడినా తండ్రి దూరమయ్యాడనే బాధ ఓ వైపు.పరీక్ష కాలం మరో వైపు.

 The Death Of The Father Is A Test For The Son, Father Died, Son Tenth Exams, Yel-TeluguStop.com

ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనే వేదన.అలాంటి తరుణంలో తండ్రి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.

పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆ అబ్బాయి పరీక్షకు హాజరయ్యాడు.ఈ విషాదకర ఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరయ్యాడు ఓ పదోతరగతి విద్యార్థి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లో ఈ విషాదకర ఘటన సోమవారం జరిగింది.

గొల్లపల్లి కి చెందిన పుట్టి శ్రావణ్ పదోతరగతి వార్షిక పరీక్షలు రాస్తున్నాడు.అయితే పరీక్ష రోజే తండ్రి పుట్టి రవి (45) అనారోగ్యంతో చనిపోయాడు.

ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగానే తప్పని సరి పరిస్థితిలో పరీక్ష రాస్తున్నాడు.

పరీక్ష కేంద్రంలో పుట్టి శ్రావణ్ తండ్రి చనిపోయిన బాధ ఓ వైపు.

పరీక్ష మరోవైపు ఎటూ తేల్చుకోలేక పోయిన సందర్భంలో బంధువులు ధైర్యం చెప్పి పరీక్షకు పంపించారు.ఆ బాధను పంటి బిగువునా భరిస్తూ.

పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆతడు పరీక్ష రాశాడు.మృతుడికి బార్య రేణుక కుమారులు శ్రావణ్, సాజిత్ లు ఉన్నారు.” రెక్కాడితే గాని డొక్కాడని కడు నిరుపేద కుటుంబం” వారిది రవి కి అంత్యక్రియలు నిర్వహించడానికి

నిరుపేద కుటుంబం వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్ ఆద్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.ఆ కుటుంబానికి బాసటగా రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన చల్ల మహేందర్ రెడ్డి నిలిచి కొంత ఆర్థిక సహాయం అందించాడు.

దాతలు ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేవారు 95538 94260 సెల్ నెంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.పరీక్ష ముగిసిన వెంటనే వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో శ్రావణ్ పాల్గోన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube