ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి

తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నందున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.ఇప్పటికే ప్రారంభమైన ఓటర్ సమాచార స్లీప్ ల పంపిణీ.

 Rajanna Siricilla District Administration Has A Special Focus To Increase The Vo-TeluguStop.com

ఇప్పటికే ఓటరు సమాచార స్లిప్పులను బూత్ లెవెల్ అధికారుల ద్వారా పంపిణీ చేస్తున్నారు.ఓటరు సమాచార స్లిప్పులను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యవేక్షణ చేస్తున్నారు.

తమ బూత్ పరిధిలో బి ఎల్ ఓ ఓటర్ స్లిప్‌ను నమోదిత ఓటరుకు లేదా ఓటరు కుటుంబంలోని వయోజన సభ్యునికి అందజేస్తున్నారు.బి ఎల్ ఓ ఓటర్ స్లిప్‌ను స్వీకరించినందుకు రసీదుగా, రిజిస్టర్‌లో ఓటర్ స్లిప్ పంపిణీ చేయబడిన వ్యక్తి యొక్క సంతకం లేదా బొటనవేలు ముద్రను తీసుకుంటున్నారు.

ఓటరు స్లీప్ తో పాటు సి-విజిల్ పాంప్లెట్ ను ఓటరు కు అందజేస్తున్నారు.అలాగే ప్రతి కుటుంబానికి ఓటరు గైడ్ ను కూడా అందజేస్తున్నారు.

సెక్టార్ పరిధిలో ఓటరు స్లిప్ లు ప్రతి ఓటరుకు అందేలా సెక్టార్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.

ఓటింగ్ శాతం తక్కువ నమోదైన పోలింగ్ కేంద్రాల పరిధిలో కళాజాత ప్రదర్శనలు.

ఓటింగ్ శాతం తక్కువ నమోదైన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యం చేసేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి లలో కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు పల్లెలతో పోల్చుకుంటే పట్టణాలలోనే ఓటు నమోదు శాతం తక్కువగా ఉన్నందున ప్రధానంగా సిరిసిల్ల వేములవాడ పట్టణాలలో కళాజాత ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం.

యువకులను ఓటు వేసేలా చూసేందుకు సామాజిక మాధ్యమాలను జిల్లా యంత్రాంగం వేదికగా ఉపయోగించుకుంటుంది.ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఓటు హక్కు ప్రాధాన్యత వినియోగం గురించి తెలిపేలా ప్రత్యేకంగా వీడియోలు పాటలు రూపొందించి ఓటర్లను చైతన్యం చేస్తున్నారు.

స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఓటేద్దాం….రండి! అనే ఆడియో, వీడియో సిడి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.

డిపిఆర్ఓ వాట్సప్ వేదికగా ఓటు హక్కు ప్రాధాన్యత, వినియోగం అంశంగా మీకు తెలుసా? అనే పేరుతో నిర్వహిస్తున్న వాట్సప్ పోల్ ప్రాచుర్యం పొందింది.

Telugu Anurag Jayanthi, Siricilla, Percentage-Telugu Districts

గ్రామాల్లో ఓటు హక్కు ప్రాధాన్యత తెలిపేలా ఫ్లెక్సీల ఏర్పాటు.జిల్లాలోని 255 గ్రామ పంచాయితీ లలో ఓటు హక్కు ప్రాధాన్యత తెలిపేలా జిల్లా యంత్రాంగం ఫ్లెక్సీ లను ఏర్పాటు చేసింది.దివ్యాంగులు సులభంగా ఓటు హక్కు వినియోగంచుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు.

జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో 547 పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులు వృద్ధులు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం ను ఏర్పాటు చేశారు.

అలాగే పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు అస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అధికారులు కల్పిస్తున్నారు.ఓటింగ్ నమోదు శాతం పెంచడంపై జిల్లా కలెక్టర్ అనురాజయంతి ప్రత్యేక దృష్టి సారించి ఆ దిశగా పర్యవేక్షిస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం.40శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80ఏళ్లకు పైబడిన ఓటర్లకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తున్నారు.వీరితో పాటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ పలు విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది.ఎయిర్‌పోర్టు ఆథారిటి ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ రైల్వే, ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో, దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియో, విద్యుత్‌శాఖ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ), పౌర సరఫరాల శాఖ, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోలింగ్‌ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్‌ పొందిన జర్నలిస్ట్‌లు, అగ్నిమాపక శాఖ అధికారులు బ్యాలెట్‌ ఓటు వేయవచ్చు.

ప్రత్యేక ఆకర్షణగా ఐ విల్ ఓట్ సెల్ఫి స్టాండ్.సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ప్రవేశ మార్గం ద్వారా వద్ద ఏర్పాటుచేసిన ఐ విల్ ఓట్ పేరుతో జిల్లా ఐ అండ్ పి ఆర్ ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాండ్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఓటర్లు సెల్ఫి స్టాండ్ వద్ద ఫోటోలు దిగుతూ మేము తప్పకుండా ఓటు వేస్తాము అంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube