రాజన్న సిరిసిల్ల :తెలంగాణ టీచర్స్ యూనియన్ (టి.టి.
యు) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ పాఠశాలలో ఈ రోజు నిర్వహించారు.ఈ సమావేశంలో పలు విషయాలను చర్చించి పలు తీర్మానాలను చేశారు.
పెండింగ్ డి.ఏ లను వెంటనే ప్రకటించాలని, వెంటనే పి.ఆర్.సి అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండికొప్పుల రవి, తడుకల సురేష్ లు టి.టి.యు రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కార్యావర్గాన్ని ప్రకటించారు.జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా యాద రవి(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -గాలిపల్లి, ఇల్లంతకుంట మండలం), దూస మధు (ఎంపీ.
పి.ఎస్ అంబేద్కర్ నగర్, సిరిసిల్ల మండలం), జిల్లా ఉపాధ్యక్షులుగా వంగాల తిరుపతిరెడ్డి (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుద్దాల, కోనరావుపేట మండలం), లకావత్ రవి(ఎంపీపీస్ జోగాపూర్ చందుర్తి మండలం), మడికంటి మల్లేశం(ఎంపీ.యు.పి.ఎస్ గండి లచ్చకపేట,తంగళ్లపల్లి మండలం),గంగారపు చిరంజీవి(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మారం, కోనరావుపేట మండలం), మహిళా ఉపాధ్యక్షురాలుగా కె.పావని(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సింగాపూర్,చందుర్తి మండలం), జిల్లా కార్యదర్శులుగా బూర సుమన్ (ఎంపీపీస్ ఇప్పలపల్లి,సిరిసిల్ల మండలం), మహిళా కార్యదర్శులుగా కె.మంజుల (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతానగర్, సిరిసిల్ల)బి.స్వాతి (ఎంపీపీస్ సర్దాపూర్,సిరిసిల్ల మండలం) లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
నూతనంగా నియామకం అయిన సభ్యులు సంఘ బలోపేతం కోసం కృషి చేయాలనీ పిలుపినిచ్చారు.నూతనంగా నియామకం అయిన సభ్యులు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర జిల్లా శాఖ ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలిపారు.