రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మాల మహానాడు కమిటీ పిలుపుమేరకు ఎల్లారెడ్డిపేట మండలంలో మాల మహానాడు నాయకులను సోమవారం తెల్లవారుజామున ఎల్లారెడ్డిపేట పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి అదుపులోకి తీసుకున్నారు.మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రోడ్డ రామచంద్రంతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజకుమార్ లను ముందస్తు అరెస్టులు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన బిజెపి నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రి అమీషా వెంటనే అట్టి మాటలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమీత్ షా ను మంత్రి పదవి నుంచి భర్త రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం మాలలను అనగా దోక్కలని చూస్తుందని అరెస్టులు మాలలకు కొత్తిమీ కాదన్నారు.అమితాషా మాలలకు క్షమాపణ చెప్పాలని చెప్పేదాకా మాలల ఆందోళన కొనసాగుతూనే ఉంటుందన్నారు.