టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో తన నటనతో హన్సిక ( hansika)మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అయితే హన్సిక వల్ల తనకు వేధింపులు ఎదురవుతున్నాయని ఆ వేధింపులను తాను తట్టుకోలేకపోతున్నానంటూ బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ(Television actress Muskan Nancy) పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.
ఆడపడచు హన్సిక, అత్త జ్యోతి, భర్త ప్రశాంత్ (Hansika, aunt Jyoti, husband Prashanth)నన్ను మానసికంగా హింసిస్తున్నారని ఆమె తెలిపారు.ఒత్తిడి వల్ల ఫేస్ లో కొంత భాగం పక్షవాతానికి గురైందని ఆమె కామెంట్లు చేశారు.పోలీసులు ముస్కాన్ నాన్సీ చెప్పిన విషయాల ఆధారంగా గృహ హింస కేసును నమోదు చేసుకున్నారు.2020 సంవత్సరంలో ప్రశాంత్, ముస్కాన్(Prashant, Muskan) వివాహం జరగగా వివాహం అనంతరం అత్త, ఆడపడచు ఖరీదైన బహుమతులు కావాలని కోరారని ఆమె చెప్పుకొచ్చారు.
ఆస్తులకు సంబంధించి ఏవో కుట్రలకు పాల్పడ్డారని ముస్కాన్ వెల్లడించారు.తమ వైవాహిక బంధంలో హన్సిక జోక్యం ఎక్కువైందని హన్సిక టార్చర వల్ల నా ఫేస్ పాక్షిక పక్షవాతానికి దారి తీసిందని ఆమె పేర్కొన్నారు.ప్రశాంత్ (prashant)ప్రస్తుతం విదేశాల్లో ఉండగా 2022 నుంచి ప్రశాంత్, ముస్కాన్ ( Prashant, Muskan)విడివిడిగా ఉంటున్నారని సమాచారం అందుతోంది.గతంలో ఈ వ్యాధి బారిన పడిన సమయంలో నేను కోలుకున్నానని కానీ మళ్లీ ఈ వ్యాధి బారిన పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ వ్యాధి వల్ల నేను, నా పేరెంట్స్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యామని ఆమె తెలిపారు.లైఫ్ అనుకున్నంత సులువు కాదని ఏదో ఒకరోజు పరిస్థితులు మారిపోతాయని ఆమె తెలిపారు.హన్సిక చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.నటి హన్సిక అభిమానులు మాత్రం ఈ కామెంట్లను నమ్మడం లేదు.ఈ కేసు విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.