ఏఎన్నార్ ఒత్తిడితో మెగాస్టార్ సినిమా వదిలేసిన కోదండరామిరెడ్డి

చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించాయి.

 Kondaramireddy Left The Chance To Work With Chiranjeevi Due To Akkineni , Anr, C-TeluguStop.com

అంతేకాదు.చిరంజీవిని స్టార్ హీరో, టాలీవుడ్ నెంబర్ గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు కోదండరామిరెడ్డి.

వీరిద్దరు కలిసి తీసిన సినిమాలన్నీ సంచలన విజయాలు అందుకున్నాయి.న్యాయంకావాలి, అభిలాష, ఖైదీ, ఛాలెంజ్, కిరాతకుడు, రక్తసింధూరం, విజేత, రాక్షసుడు, దొంగ మొగుడు, పసివాడి ప్రాణం, ముఠామేస్త్రి లాంటి సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి.

ఒకానొక సమయంలో చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి ఓ సినిమాను మొదలుపెట్టి.ఆ తర్వా దాని నుంచి తప్పుకున్నాడట.

ఇంతకీ ఈ సినిమా విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కోదండరామిరెడ్డి అర్థాంతరంగా తప్పుకున్న ఆ సినిమా పేరు శివుడు శివుడు శివుడు.1983లో ఈ సినిమాను శ్రీ కాంతి చిత్ర పతాకంపై క్రాంతి కుమార్ నిర్మించాడు.ఈ సినిమాలో కోదండ‌రామిరెడ్డి ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా పేరు ఉంటుంది కానీ.

ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించలేదు.రాధిక డబుల్ రోల్ లో నటించిన ఈ సినిమాను ఊటీలో ప్రారంభించారు.

వరుసగా 40 రోజుల పాటు అక్కడే షూటింగ్ చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించింది.

Telugu Chiranjeevi, Radhikadouble, Shivudu Shivudu, Tollywood-Telugu Stop Exclus

అదే సమయంలో అక్కినేని నాగేశ్వర్ రావు సొంతంగా శ్రీరంగనీతుల అనే సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే తెరకెక్కుతోంది.అదే సమయంలో అక్కినేని ఫోన్ చేసి హైదరాబాద్ కు వస్తున్నావా? లేదా? అని ప్రశ్నించాడు.అప్పుడు దర్శకుడి డేట్లు కూడా అన్నపూర్ణ స్టూడియో వారికి కేటాయించినవే ఉన్నాయి.అటు న్యాయం కావాలి లాంటి సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన క్రాంతి కుమార్ మాట కూడా కాదన లేక చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు.

Telugu Chiranjeevi, Radhikadouble, Shivudu Shivudu, Tollywood-Telugu Stop Exclus

ఏం చేయాలో తెలియక రాఘవేంద్రరావు తండ్రి ప్రకాశ్ రావుకు ఫోన్ చేశాడు కోదండరామిరెడ్డి.అక్కినేని నొప్పించకుండా ఒప్పించాలని కోరాడు.కానీ ఏఎన్నార్ పట్టు విడవలేదు.ఏం చేయలేక చిరంజీవి మూవీని వదిలి.శ్రీరంగనీతులు సినిమా తీసేందుకు హైదరాబాద్ వచ్చాడు.అయితే చిరంజీవి సినిమాకు నిర్మాత క్రాంతి కుమారే దర్శకత్వం కూడా వహించాడు.

అయితే ఈ సినిమా పోస్టర్స్ తో పాటు టైటిల్స్ లోనూ దర్శకుడిగా కోదండరామిరెడ్డి పేరునే వేశారు.కానీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube