బాలకార్మికులు కనిపిస్తే పోలీస్ వారికి సమాచారం అందించండి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడ జనవరి 01 నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ -XI ను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ వివిధ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులను ఆదేశించారు.జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్,అదనపు ఎస్పీ చంద్రయ్య,వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.

 If You See Child Labourers Inform The Police District Sp Akhil Mahajan, Child L-TeluguStop.com

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ -XI లో పాలుపంచుకొంటున్న ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా విధులు నిర్వహించాలన్నారు.ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని దానిని అనుభవించటం ప్రతీ పౌరుని హక్కు అని,క్షణికావేషంలో పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విషయాలకే తల్లి దండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని,ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని,గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ స్మైల్,ముస్కాన్ లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తప్పిపోయిన పిల్లలను వెతికి ‘దర్పణ్ ‘ అప్లికేషన్ ద్వారా వారిని గుర్తించి,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి తిరిగి తల్లి దండ్రుల వద్దకు చేర్చి వారి శోకాన్ని తీర్చాలన్నారు.బిక్షాటన చేస్తున్న వారి గురించి, బాలకార్మికుల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం ఇవ్వడానికి చైల్డ్ హెల్ప్ లైన్ కు చెందిన 1098,112 నెంబర్ల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు.

సిరిసిల్ల, వేములవాడ డివిజన్ స్థాయిలో ఒక సబ్-ఇన్స్పెక్టర్ తో పాటుగా ఒక మహిళా పోలీస్ అధికారి, నలుగురు సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో నెల రోజుల పాటు ఇదే పనిపై ఇటుక బట్టి లు,వివిధ రకాల పరిశ్రమలు,బస్ స్టేషన్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబాలకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించాలని అన్నారు.స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు నచ్చ చెప్పి తిరిగి వారిని పాఠశాలకు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్నారు.

ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేసి లేదా పోలీస్ లకు సమాచారం తెలపాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,CWC చైర్మన్ అంజయ్య,DM&HO రజిత, ఎస్.ఐ రమేష్,షీ టీం ఏ.ఎస్.ఐ ప్రమీల, వివిధ డిపార్ట్మెంట్ ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube