వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పండుగ సంబరాలు,రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతుగా వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టణంలోని తెలంగాణ చౌకు వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో అనేక మంది ప్రజలు లబ్ధి పొందుతారని అన్నారు.
సంక్రాంతి పండుగ రాకతో రైతుల ఇండ్లలో సంబరాలు మొదలయ్యాయని దీంతో రేవంత్ సర్కార్ ప్రజలకు మేలు చేకూర్చే విధంగా మరో బృహత్ కార్యక్రమాలు చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు రోండీ రాజు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్, యూత్ ప్రెసిడెంట్ రోమాల ప్రవీణ్, ఎస్సీసెల్ ప్రెసిడెంట్ నేదూరి రమేష్, ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సాయినేని కర్ణాకర్, చిలుక ప్రభాకర్, బండ శ్రీనివాస్, అడ్డిక శ్రీనివాస్ రెడ్డి, ఎడపల్లి విష్ణు, చల్లా సురేష్, బత్తిని ఎల్లగౌడు, కొండవేణి తిరుపతి, నేదూరి రాకేష్, నేదూరిదేవరాజు, బొడ్డు రాములు, జాగిరి సురేష్ అచ్చు వినోదు తదితరులు పాల్గొన్నారు.