*సిరిసిల్ల టిజిఓ ఆఫీస్ బెరియర్స్ నియామకం పబ్లిసిటీ సెక్రటరీ గా జిల్లా పౌర సంబంధాల అధికారి వంగరి శ్రీధర్ అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యుల నియామకం జరిగింది.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాజ్యాంగం లోని నిబంధనల ప్రకారం డిసెంబర్ 11, 2024 నాడు సిరిసిల్ల జిల్లా లో నిర్వహించిన సమావేశంలో 2024-25 నుంచి 2026-27 వరకు 3 సంవత్సరాలకు గాను ఏకగ్రీవంగా ఆఫీస్ బెరియర్స్ ఎంపిక చేయడం జరిగింది.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా శివ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జి.హెచ్.ఎం.ఎల్ మోతిలాల్, జాయిన్ట్ సెక్రెటరీగా ఈఈ రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో డిఎంఓ గా పనిచేస్తున్న జి.అనిల్ కుమార్, పబ్లిసిటీ సెక్రటరీ గా జిల్లా పౌర సంబంధాల అధికారి వంగరి శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వేములవాడ మిషన్ భగీరథ గ్రిడ్ చెందిన ఏఈఈ కంది వినయ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఆఫీస్ బేరర్స్ నియామక పత్రాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ చేతుల మీదుగా సంబంధిత అధికారులకు అందించడం జరిగింది.
అధ్యక్షులు సమర సేన, సెక్రెటరీ జబీ,సహ అధ్యక్షులు జోగం రాజు, కోశాధికారి అహ్మద్ రసూల్, ఉప అధ్యక్షులు అంజి రెడ్డి, అబ్దుల్ వాజీద్, జాయింట్ సెక్రటరీలు శ్రీకాంత్, చంద్రకళ, అనిల్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాగర్, ప్రచార కార్యదర్శి వంగరీ శ్రీధర్, క్రీడల కార్యదర్శి లక్ష్మణ్ , కార్యవర్గ సభ్యులు కవిత, వినయ్ తదితరులు పాల్గొన్నారు.