రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని దోసెల గూడెం కాలనీకి చెందిన నర్సింలు గత నెల రోజుల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతని శస్త్ర చికిత్స కోసం దాదాపు 50 వేల రూపాయలు ఖర్చు కాగా అతని ఆర్థిక పరిస్థితిని గమనించిన యంగ్ లయన్స్ క్లబ్( 2003-04) బ్యాచ్ కు చెందిన తోటి మిత్రులు తక్షన వైద్య సహాయం కోసం 15,000/- రూపాయల నగదు, 25 కేజీల బియ్యం ను అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఎస్ఎస్సి 2003-2004 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు దాదాపు 20 సంవత్సరాల నుండి సామాజిక సేవలో ముందుంటున్నారని గతంలో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు చేసిన ఘనత వారికి ఉందని తెలిపారు.
రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఆశయ్యగారి చంధ్రశేఖర్ గౌడ్, సంఘ సభ్యులు ప్రసాద్, నందు, దేవేందర్, భాస్కర్, అజయ్,శంకర్, నాంపల్లి, హమీద్ తదితరులు పాల్గొన్నారు.