దుబాయ్ లో ఆల్ సయాఖి కంపెనీ ప్రారంభించిన - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల రుద్రంగి మండలకేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లి కుమార్ దుబాయ్ లోని బార్ దుబాయ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ సయాఖి ఆటో కేర్ కంపెనిని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మిదిగా ప్రారంభించారు.అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యండి బొల్లి కుమార్ తో పాటు కంపెనీ కార్మికులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) కు శాలువతో సన్మానించి పుష్ప గుచ్ఛం అందించారు.

 All Sayakhi Company Launched In Dubai - Govt Whip Adi Srinivas ,aadi Srinivas ,-TeluguStop.com

అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కంపెనీ స్టాఫ్ తో పాటు కార్మికుల బాగోగులను, ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్నారు.

అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లాగే ఆల్ సయోకి కంపెనీ కూడా అంచెలంచెలుగా ఎదిగాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

ఈ సందర్భంగా బొల్లి కుమార్( Bolli Kumar ) మాట్లాడుతూ….నాడు మొదటిసారిగా అద్నాన్ కార్ వాష్ కంపెనీ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రావడం, నేడు ” ఆల్ సాయఖి ఆటో కేర్ కంపెనీ ” ప్రారంభించడానికి మరోసారి ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube