శివ నామస్మరణతో మారు మోగుతున్న రాజన్న ఆలయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.కోడె, స్పెషల్ దర్శనం, శీఘ్ర దర్శనం, క్యూ లైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి.

 Huge Devotees Rush At Vemulawada Rajanna Temple, Devotees Rush ,vemulawada Rajan-TeluguStop.com

వేకువజాము నుండే భక్తులు తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, కోడె మొక్కుల చెల్లింపుకై గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు.

స్వామి వారి దర్శనానికి దాదాపు నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతోంది.

పిల్లలకు స్కూల్ హాలిడేస్ దగ్గర దగ్గర పడుతుండడంతో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.రానున్న రోజుల్లో కూడా భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా చల్లని త్రాగునీరుతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube