మానకొండూర్ నియోజకవర్గం( Manakondur Constituency ) ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయితీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ( Karimnagar District Congress Committee President Dr.
Kavvampally Satyanarayana ) వారి డిమాండ్స్ అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని అన్నారు.
గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు.వారికి కనీస వేతనం 19000/- చెల్లించాలనీ,పది లక్షల ప్రమాద భీమా వర్తింపు చేయాలన్నారు.
జీవో 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనీ,సంవత్సరానికి మూడు జతల యూనిఫామ్ ఇవ్వాలన్నారు.పంచాయతీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చలాని అన్నారు.
ఒక వేళ ఈ ప్రభుత్వం పరిష్కారించకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని డిమాండ్లు పరిష్కారిస్తాం అని హామీ ఇచ్చారు.