ఎన్నికల ఫిర్యాదుల పై తక్షణమే స్పందించాలి.. కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల ఫిర్యాదుల పై వేగంగా స్పందించాలనీ కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం గ్రౌండ్ ఫ్లోర్ లో 24 గంటలు పని చేసే సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ, మీడియా సెంటర్ లను కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు తనిఖీ చేసి సి – విజిల్, కంట్రోల్ రూం, 1950, సోషల్ మీడియా ఫిర్యాదుల నమోదును పరిశీలించారు.

 Respond Immediately On Election Queries Collector Anurag Jayanthi, Election Que-TeluguStop.com

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిస్వాక్షపాతంగా స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో జరగడంలో సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ , మీడియా సెంటర్ కీలక పాత్ర అన్నారు.ఎన్నికలలలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా.

మీడియా లో ఫేక్ న్యూస్ ప్రసారమైన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం బాధ్యులు మహమ్మద్ రఫీ, మీడియా సెంటర్ బాధ్యులు, డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube