రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం శ్రావణమాస రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో వరలక్ష్మీ వ్రతం, కుంకుమ పూజ ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో మహా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.
ప్రతి ఏటా శ్రావణమాస 2వ వారంలో వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజ కార్యక్రమం అనంతరం లక్ష్మీదేవి అమ్మవారికి మహిళలు భక్తులు బియ్యం సమర్పించారు.ఈ కార్యక్రమానికి చందుర్తి మండల చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు