అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) తెలిపారు.శనివారము సాయంత్రం కలెక్టరేట్ లో పోస్టల్ బ్యాలెట్ , హోమ్ ఓటింగ్, ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్ కు కావల్సిన బస్సులు, కౌంటింగ్ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమావేశం నిర్వహించారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోనేలా చూడాలన్నారు.హోమ్ ఓటింగ్ ప్రక్రియ ను పూర్తి చేయాలన్నారు.
సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, వేములవాడ ప్రభుత్వ హై స్కూల్ లో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
అలాగే బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కు, రిసెప్షన్ పక్కగా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ), రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్,మధుసూదన్ ,నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
.