విద్యార్థులకు బస్సుల సంఖ్యను పెంచాలి

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వున్న గ్రామాలకు బస్సులు నడపాలి డిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేసిన చేసిన కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులకు బస్సుల సంఖ్యను పెంచి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వున్న గ్రామాలకు బస్సులు నడపాలని డిపో గారికి వినతి పత్రం అందజేసిన చేసిన కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులకు బస్సుల సంఖ్యను పెంచాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి భాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టిసి డిపో మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ కళాశాలల, పాఠశాలల సమయంలో పొద్దున, సాయంత్రం విద్యార్థుల కోసం అధికంగా బస్సులు నడిపించాలని, సమయానికి నడిపించాలని విద్యార్థులు సాయంత్రం వేళలో రెండు మూడు గంటలు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారని దీనిని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్యను పెంచాలని గంటలు గంటలు బస్ స్టాప్ లో విద్యార్థులు ఎదురుచూస్తూ ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్లి ఎప్పుడు చదువుతారు అని ప్రశ్నించారు.

 The Number Of Buses For Students Should Be Increased, Rajanna Sircilla, Rtc Bus,-TeluguStop.com

బస్సుల సంఖ్యను పెంచి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వున్న గ్రామాలకు బస్సులను నడిపించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.విద్యార్థులకు బస్సులలో నిలబడడానికి కూడా ప్లేస్ ఉండటం లేదని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

తొందరలోనే అకాmaheడమిక్ ఇయర్ ముగుస్తుందని విద్యార్థులకు పరీక్ష సమయాలకు సరైన టైంలో అత్యధికంగా బస్సులు నడిపించాలని,ఇప్పటికీ కొన్ని గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదని అలాంటి గ్రామాలకు కూడా బస్సులు నడిపించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున డిపో మేనేజర్ తెలిపారు.డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి అధికారులతో ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నవీన్, ముగ్ధం అనిల్ గౌడ్, తడిగోపుల వినయ్, సామల శ్రీకాంత్, శ్రీనివాస్, దేవరాజు.తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube