పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలిసుల ఆకస్మిక దాడీ

12 మంది అరెస్ట్,56,810/- రూపాయల నగదు,12 మొబైల్ ఫోన్స్ స్వాధీనం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ మారుతి ఆధ్వర్యంలో తంగాల్లపల్లి మండలం మండేపల్లి గ్రామ శివారులోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద బహిరంగంగా డబ్బులు పందెం పెట్టుకుని రహస్యంగా పేకాట ఆడుతున్నారు అనే పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసి పేకాటఆడుతున్న 12 మంది వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 56,810 /- రూపాయల నగదు,12మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కొరకు తంగాల్లపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగిందని తెలిపారు.

 Task Force Police Surprise Attack On Poker Base , Police Surprise Attack, Task F-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్.ఐ మారుతి మాట్లాడుతూ.సులభ సంపాదనకు అలవాటుపడి కొంతమంది ఈ విధంగా చెడు వ్యసనాలకు అలవాటు పడి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నావారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో నిత్యం టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు నిరహిస్తామని ఎవరైన, గ్యాంబ్లింగ్, బెట్టింగులకు కానీ, పేకాట వంటి జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.స్థానికులు మీ ప్రాంతం లో ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నవి తెలిస్తే వెంటనే పోలీస్ సమాచారం ఇవ్వాలి, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యం గా ఉంచడం జరుగుతుంది అన్నారు.

ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ మారుతి సిబ్బంది శ్రీనివాస్, అక్షర్,డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube