సీనియర్ నాయకులతో నాటి ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్న చిక్కాల

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను బిఆర్ ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కలిసి నాటి ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్నారు.బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సీనియర్ నాయకులు అందె సుభాష్ ను , బొప్పాపూర్ మాజీ సర్పంచ్ రామా భీమేశ్ ను , మాజీ ఎంపీటీసీ వంగల వసంత్ ను , చింతల ధర్మయ్య ను ఎల్లారెడ్డిపేట మండలంలో మెట్టమొదటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ని , నేవూరి సర్వయ్యగారి పద్మారెడ్డి ని, నేవూరి జగన్ రెడ్డి ని , పోచయ్య గారి లింగారెడ్డి లను వారి వారి ఇంటికి వెళ్ళి చిక్కాల రామారావు స్వయంగా కలిసి ఉద్యమం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

 Chikkala Shared Memories Of The Movement With Senior Leaders, Chikkala , Senior-TeluguStop.com

గతంలో బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసి ఎంఎల్ ఏ గా కెటిఆర్ ను గెలిపించుకున్నట్టే ఈసారి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరు సమిష్టిగా కలిసి గెలుపుకోసం కృషి చేయాలని ఆయన వారిని కోరారు.మళిదశ తెలంగాణ ఉద్యమం లో పనిచేసిన అందరి నాయకులను మీరు కలువాలని వారు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మెజారిటీ కోసం సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తెలంగాణ మళిదశ ఉద్యమ కారులందరిని త్వరలోనే స్వయంగా కలిసి తన వంతుగా ఆ బాధ్యత పోషిస్తానని సె‌స్ చైర్మన్ చిక్కాల రామారావు వారితో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube