నిర్దేశిత సమయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్దేశిత సమయంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పై సంబంధిత అధికారుల, పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు.

 The Survey Of Indiramma Houses Should Be Completed Within The Stipulated Time Di-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం మనకు 1లక్షా 7వేల 398 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటి వరకు వీటిలో 15వేల 510 దరఖాస్తుదారుల ప్రస్తుత నివాసం ఇందిరమ్మ యాప్ లో క్యాప్చర్ చేయడం జరిగిందని అన్నారు.

ప్రతి రోజూ పంచాయతీ కార్యదర్శి 25 ఇండ్లు మేరకు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలని, గ్రామాల్లో అవసరమైతే అదనపు లాగిన్లు తీసుకుని సర్వే వేగవంతం కావాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

అనంతరం జిల్లాలోని మండలాల్లో వివిధ గ్రామాల్లో జరుగుతున్న సర్వే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.సెల్ టవర్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఎదురైతే ఆఫ్ లైన్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని, నిర్దేశిత సమయం డిసెంబర్ 31 లోగా సర్వే పనులు పూర్తి కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, ఎం.పి.డి.ఓ లు, పంచాయితి కార్యదర్శులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube