బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట వీర్నపల్లి మండలాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వెలకట్టలేనిదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఎల్లారెడ్డిపేటలో మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలో ఈ మూడు మండలాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అవిశ్రాంతంగా పోరాటం చేయడం జరిగిందన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు ఓటమి • చెందినప్పటికీ కార్యకర్తలు నిరాశ చెందవద్దన్నారు.
ఒకవైపు బిజెపి ప్రధాని మోదీ మరొకవైపు రామ మందిరం అక్షింతల పేరుతో ఓటర్లను మభ్యపెట్టడం జరిగిందన్నారు.పోటీలో లేని బిఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచడం మూలంగా ఓట్లు సంపాదించుకోవడం జరిగిందన్నారు.
నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పనిచేసి తమ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారని అన్నారు.రానున్న కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల దరిచేరే విధంగా కృషి చేయాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
అక్టోబర్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆయా గ్రామాలలో తమ పట్టు సాధించాలని అన్నారు.