ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ తహశీల్దార్ పుష్పాలత

రాజన్న సిరిసిల్ల జిల్లా : పాలనను ప్రజలకు మరింతచేరువ చేయడంతో పాటు ప్రతి గడపకూ సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ తహశీల్దార్ పుష్పలత( Tehsildar Pushpalata ) అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమములో తహశీల్దార్ హాజరై మాట్లాడారు.

 Tehsildar Pushpalatha Said That People Should Take Advantage Of The Public Gover-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం సందేశాన్ని ఎంపీడీవో నల్ల రాజెందర్ రెడ్డి ప్రజలకు చదివి వినిపించారు.అనంతరం తహశీల్దార్ మాట్లాడుతు 6 గ్యారంటీ ల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

డిసెంబర్ 28 నుండి ప్రజా పాలన సదస్సులు నిర్వహించి అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారనీ తెలిపారు.మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏంపిటిసి బాలగోనీగౌతమి శ్రీనివాస్ మండల పంచాయతీ అధికారి గంగ తిలక్, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube