రాజన్న సిరిసిల్ల జిల్లా : గిరిజన తండాలాను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎంపీ పీ పిల్లి రేణుక కిషన్ అన్నారు.పట్టణాలకు దీటుగా గిరిజన తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలంగాణ ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసం నెలనెలా లక్షల రూపాయలు కేటాయించడంతో తండాల రూపురేఖలు మారిపోయాయని ఆమే అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలం దేవుని గుట్ట తండా లో 20 లక్షల తో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని స్థానిక సర్పంచ్ పెంటయ్య నాయక్ ,ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తో కలిసి శనివారం ప్రారంభించారు.అనంతరం పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ గిరిజన తండాల్లో ఏ వీధిని చూసినా సరైన రోడ్లు లేకపోయేవని.
రోడ్లపైనే మురుగు, చెత్తాచెదారం నిండి దర్శనమిచ్చేవి.దీంతో నిత్యం దోమలు, ఈగలతో ప్రజలు సతమతమయ్యేవారని ఆమే గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసి తండాలకు అబివృద్దికి పాటు పడుతున్నారన్నారు అనంతరం జెడ్పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ పల్లెప్రగతితో తండాల్లో పరుచుకున్న పచ్చదనం సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు నూతన గ్రామపంచాయతీలు కాని నేడు తండాల అభివృద్ధే లక్ష్యంగా కోట్లాది రూపాయలు కేటాయించడంతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాలతో పట్టణాలను తలదన్నే రీతిలో తండాల రూపురేఖలు మారాయి అన్నారు.తండాలా అబివృద్దికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను రానున్న ఎన్నికల్లో.
గెలిపించుకోవాలని ఆయన కోరారు.
సర్పంచ్ పెంటయ్య నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన తండాలాను గ్రామ పంచాయతీ లు గా మార్చి తండాల్లో గ్రామ పంచాయతీలకు పక్క భవనాల నిర్మాణాలకు నిధులు ఇచ్చి గిరిజనుల అభివృద్ధి కి పాటు పడుతున్నారన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు.
తండాల్లో నెలకొన్న సమస్యలను ముందుగానే గుర్తించి గ్రామపంచాయతీ సభ్యుల ఆమోదం మేరకు పనిచేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్, తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ , ఉప సర్పంచ్ ప్రకాష్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంభాల మల్లారెడ్డి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ , మాజీ సర్పంచ్ నాజీం, రమేష్ నాయక్, లక్ష్మన్ నాయక్, సతీష్ నాయక్, సుందర్ నాయక్, ప్రకాష్ నాయక్, రమేష్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు , బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు,
.