70 ఏళ్ల జీవితంలో 100 సార్లు సిరిసిల్లలో తిరిగాను

ఇప్పుడు మానేరు సజీవ జలధారగా మారింది*ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగం.అశేష జనవాహిని మధ్య ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.

 In My 70 Years Of Life, I Have Traveled To Sirisilla 100 Times-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో రాజకీయం ఊపందుకుంది.ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు ఈ సమరంలో గెలవాలని.

ప్రభుత్వం ఏర్పరచాలని ఆలోచనలో ఉన్నాయి.ఇక అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) విషయానికి వస్తే అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల డేట్ తరువాత ప్రజా గర్జన సభలు అంటూ బిజీ బిజీగా మారిపోయింది.

మంగళవారం సిరిసిల్లలో జరుగిన ప్రజా గర్జన సభలో కేసీఆర్( CM KCR ) మాట్లాడుతూ.సమైక్య పాలనలో మానేరులో దుమ్ములేసేది.ఇపుడు మన స్వరాష్ట్ర పాలనలో అప్పర్ మానేరు మత్తడి దుంకే పరిస్థితి మనం చూస్తున్నాం.కలలో అనుకున్న అభివృద్ధి ఇప్పుడు సిరిసిల్లలో కళ్లారా కనపడుతుంది.కేటీఆర్ సిరిసిల్లలో గెలిచిన తర్వాత చేనేతల కార్మికుల దశ మారింది.చేనేత కార్మికులు బ్రతకాలి.

వారి కుల వృత్తి మగ్గాలకు పని ఉండాలి.చేనేత కార్మికులకు పని కల్చించే దృష్టితోనే బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభించాం.

బతుకమ్మ చీరలు చేనేత కన్నీరు తుడిచే పథకం.కానీ కొంత మంది బతుకమ్మ చీరలపై కూడా రాజకీయం చేస్తున్నారు.

కొన్ని చోట్ల బతుకమ్మ చీరలు తగలబెట్టడం నీచాతినీచమని కేసీఆర్ అన్నారు.నా 70 ఏండ్ల జీవితంలో వందలసార్లు సిరిసిల్లలో తిరిగాను ఇప్పడు మానేరు సజీవ జలధారగా మారింది.

ఎండకాలంలో కూడా అప్పర్ మానేరు మత్తడి దూకుతోంది.ఇవన్నీ చూస్తుంటే కడుపు నిండుతోంది.

గతంలో సిరిసిల్ల ప్రాంతంలో గోడలపై రాతలు చూసి మనసు చలించేంది, అందుకే సిరిసిల్ల మరో షోలాపూర్‌గా మారాలన్నదే నా ధ్యేయం.చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని గోడలపై రాతలుండేవి, బీఆర్ఎస్ పార్టీ తరుపున రూ.50 లక్షలు ఇచ్చి చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకున్నాము.ఆసరా పెన్షన్ రూ.5 వేలకు పెంచాము.రేషన్‌ ద్వారా సన్నబియ్యం ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు…ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్,వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube