ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేల పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు..

రాజన్న సిరిసిల్ల జిల్లా :అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా 06 బి ఎస్ ఎఫ్ కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లాకి రావడం జరిగింది.ఈ సందర్బంగా ఎల్లారెడ్డిపేట్( Yellareddipeta ) సర్కిల్ కు కేటాయించిన బి ఎస్ ఎఫ్ కంపెనీ అధికారులతొ , సిబ్బంది తో ఎన్నికల సమయoలో నిర్వహించాల్సిన విధులపై ఎస్పీ ఎల్లారెడ్డిపేట్ లో సమావేశం నిర్వహించారు.

 Full Security Arrangements For People To Freely Exercise Their Right To Vote , R-TeluguStop.com

ఈ సందర్బంగా ఎస్పీ( SP Akhil Mahajan ) మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు జిల్లా పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు.

కేంద్రం సాయుధ బలగాలు ను క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో, రూట్ బందోబస్త్, స్ట్రాంగ్ రూమ్, కీలకమైన పాయింట్‌ల వద్ద సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిని ఉంచడం జరుగుతుంది అన్నారు.

అలాగే చెక్ పోస్ట్ దగ్గర పటిష్ట నిఘా ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి గొడవ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి అధికారి కృషి చేసి ఎన్నికల విజయవంతం చేయాలని అన్నారు.

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రత భావాన్ని కలిగించాలని అన్నారు.ఎన్నికల పరంగా సదుపాయాల పరంగా ఎలాంటి సమస్యలు ఉన్న అధికారులకు తెలియజేయాలని సూచించారు.

ఈసందర్భంగా ఎస్పి ఎల్లారెడ్డిపేట్ సర్కిల్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ వివరాలు, చెక్ పోస్ట్ లు, జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి బి ఎస్ ఎఫ్ అధికారులకు ఎస్పీ వివరించారు.ఈ సమావేశం లో ఈ సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి,సి.

ఐ శశిధర్ రెడ్డి,ఎస్.ఐ రమాకాంత్,బి ఎస్ ఎఫ్ కమాండెంట్, బి ఎస్ ఎఫ్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube