అరటి పండు.అన్ని శుభకార్యాలకు అరటి పండును ఖచ్చితంగా ఉపయోగిస్తారు.
ఎవరి ఇంటికి వెళ్లిన ఎవరైనా వచ్చినా మనం ఎవరి ఇంటికి వెళ్లిన కచ్చితంగా తీసుకెళ్లే పండు అరటి పండు.ఈ అరటి పండును ఆయుర్వేదంలోనూ, కూరలు చేయడానికి కూడ ఉపయేగిస్తారు.
అంతేకాదు అరటి పండులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.ఇది జీర్ణక్రియకు ఎంతో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.ప్రతి రోజూ ఒక అరటి పండు తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్ అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.
అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.అంతేకాకుండా శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అరటి పండులో పోషకాలు ఎక్కువ ఉండడం వల్ల మధుమేహం, అస్తమా, అధిక రక్తపోటు క్యాన్సర్ ను నివారిస్తాయి.
అరటి పండు రోజూ ఒకటి లేదా రెండు తినడం వల్ల కిడ్నీకి సంబంధించిన జబ్బుల నుంచి తప్పించుకోవచ్చని ఒక అధ్యయనంలో తేలింది.
అరటి పండులో పీచుపదార్థము సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణ క్రియను మెరుగు పరచడమే కాకుండా మలబద్దకాన్ని నివారిస్తుంది.
బరువు తగ్గాలనుకొనేవారు రోజు అరటి పండు తినడం వల్ల బరువు తగ్గుతారు.ఎందుకంటే ఇందులో కొవ్వులు తక్కువ మోతాదులో ఉంటాయి.అంతే కాదు పిండి పదార్థము వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి ఆకలిని తగ్గిస్తుంది.
అరటి పండు తరుచుగా తినడం వల్ల పేగులను ఉత్తేజపరుస్తుంది.
దీనివల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
అరటిలో బాన్ లేక్ అనే రసాయానికి ఎయిడ్స్ వైరస్ పై పోరాడే శక్తి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఈ వైరస్ నిరోధానికి వాడుతున్న ‘టీ20’ మారావిరాక్ మందులతో సమానంగా ఈ రసాయనం పనిచేస్తుంది.ఇందులో ఉన్నా లెక్టిన్ రసాయనం వైరస్ ను శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకొని ఇన్ఫెక్షన్ ను నిరోధిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.