రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వరి తదితర పంట పొలాల్లో వేసిన విద్యుత్ స్తంభాల పైన ఉన్న విద్యుత్ తీగలు సవరించాలి అని కోరుతూ స్థానిక మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.ఇప్పటికీ పలుమార్లు పంట పొలాల్లో కరెంట్ తీగలు సవరించాలి అని సెస్ అధికారులకు చెప్పిన వినిపించు కోవడం లేదని ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు సెస్ అధికారులేనని వారు వినతి పత్రం లో పేర్కొన్నారు.
వచ్చే వరి పంట సాగు సమయం వరకు పొలాల్లో వంగి ఉన్న కరెంటు స్తంభాలు సరిచేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్,పట్టణ కాంగ్రెస్ నాయకులు చెన్ని బాబు, రొడ్డ రామచంద్రం,బుచ్చి లింగు సంతోష్ గౌడ్,పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, వంగల మల్లారెడ్డి,వీర్న పల్లి మండల కాంగ్రెస్ నాయకులు పరుమాల మల్లేష్ యాదవ్, పిట్ల పల్లవి తదితరులు పాల్గొన్నారు.