రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టైప్ రైటింగ్ పరీక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులు బ్యాచ్ ల వారిగా పరీక్షలు జరుగుతాయని ఆదర్శ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ మజీద్ అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆదర్శ టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్ లో శుక్రవారం మాట్లాడుతూ అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్,లెక్చరర్ల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయన్నారు.
శనివారం ఇంగ్లీష్, తెలుగు రెండు బ్యాచులు లోయర్ గ్రేడ్, రెండు బ్యాచులు హయ్యర్ గ్రేడ్ పరీక్షలను బ్యాచ్ లవారిగా ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయన్నారు.అదేవిధంగా ఆదివారం కూడా లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయన్నారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు స్కేల్, పెన్ను, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని పరీక్ష కేంద్రానికి గంట ముందు హాజరుకావాలని ఆదర్శ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ మజీద్ తెలిపారు.