రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లు అవగాహన కలిగి ఉండాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లు అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సేఫ్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వి రాజ్ వర్మ లు ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వి రాజు వర్మ లు మాట్లాడుతూ హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్‌ లైసెన్స్ లేకుం డా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్టు ఉపయోగించకపోవడం, మొబైల్‌ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్‌ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు.

 Auto Drivers Should Be Aware Of Road Safety, Auto Drivers , Road Safety, Rajanna-TeluguStop.com

ఎల్లారెడ్డిపేటలో గత 30 సంవత్సరాలుగా అటు యూనియన్ నిర్వహిస్తున్నారని సుమారు 200 ఆటోల వరకు ఉన్నాయని ట్రాఫిక్ నిబంధన ప్రకారమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని ఎక్కువమందిని ఎక్కించుకోకూడదని వారు సూచించారు.కానిస్టేబుల్ ప్రశాంత్,సంజన మోటార్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు కట్టెల బాబు , ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెల బాలయ్య , ఆటో యూనియన్ ప్రతినిధులు నర్రా మల్లారెడ్డి, గడ్డం శ్రీనివాస్ , పాముల భాస్కర్ గౌడ్, కదిరే చంద్రయ్య,కంచర్ల మల్లారెడ్డి, సోమారపు అంజయ్య, రేండ్ల దేవయ్య, లింబాద్రి,ఎస్.

కె అబ్దుల్ హుస్సేన్,ముష్కం శ్రీనివాస్, పర్షరాములు గౌడ్, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube